తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. రేపటి నుంచి పరిశీలనలు

0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల గడువు సోమవారం (నవంబరు 19)తో ముగిసింది. సోమవారం నామినేషన్లకు చివరితేది కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్‌ సమయం పూర్తయింది. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లు స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. నామినేషన్ల గడువు ముగియడంతో.. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమానికి తలుపులు తెరచుకున్నాయి.

మంగళవారం (నవంబరు 20) నుంచి అభ్యర్థుల నామినేష్లను పరిశీలించనున్నారు. అభ్యర్థులకు నవంబరు 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. డిసెంబరు 7న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెల్లడికానున్నాయి.


Please Read Disclaimer