రేప్ కేసుపెట్టిన మహిళతో ఎమ్మెల్యే పెళ్లి

0

ఒక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే.. పేరు పరపతి అన్నీ ఉన్నాయి.. కానీ బుద్ది మాత్రం వక్రమార్గం పట్టిందనుకుంటా.. అందుకే ఒక అమ్మాయిని వాడుకొని వదిలేసాడట.. స్వయంగా మోసపోయిన అమ్మాయి ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాక్ష్యాధారాలు అందజేసింది. ఇంకేముంది.. ఎమ్మెల్యేనే రేప్ చేశాడని కేసు పెట్టిన అమ్మాయి తరుఫున మహిళా సంఘాలు మీడియా వకాల్తా పుచ్చుకున్నాయి.. లొల్లి లొల్లి చేశాయి..

త్రిపుర రాష్ట్రంలోని దలాయికి చెందిన ఎమ్మెల్యే ధనుంజోయ్ పై ఒక మహిళ పోరాడింది. తనను వాడుకొని మోసం చేశాడని పోలీసుల గడప తొక్కింది. వివాహం చేసుకుంటానని నమ్మించి వాడుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కొంత కాలంగా ఇలా చేసి చివరకు వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కేసు ముదరడంతో ఎమ్మెల్యే బెయిల్ మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ధనుంజయ్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది..

దీంతో తన రాజకీయ భవిష్యత్ తోపాటు కేసుల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశం ఎమ్మెల్యే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అత్యాచారానికి గురైన మహిళను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో న్యాయవాది ద్వారా పెళ్లి చేసుకున్నారు. అనంతరం కేసులను ఉపసంహరించుకోవాలని సదురు రేప్ గురైన మహిళకు కండీషన్ పెట్టగా ఆమె ఒప్పుకొని ఎమ్మెల్యేగారిపై ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. ఇలా అత్యాచారం కేసును ఎమ్మెల్యే తప్పించుకున్నారు.
Please Read Disclaimer