వైఎస్ వివేకాది హత్యే.. నిర్ధారించిన వైద్యులు

0

వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని తేలింది. మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యులు ఆయనది హత్యేనని తేల్చారు. వివేకా శరీరంపై ఏడు బలమైన కత్తిపోట్లు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో పొడిచినట్లు నిర్ధారించారు. దాదాపు 7 సెంటిమీటర్ల లోతులో వివేకా తలపై కత్తి ఘాటు ఉండడంతో హత్యేనని పోస్టుమార్టం రిపోర్టులో పొందుపరిచారు. తల వెనుక – తల ముందుభాగం. – తొడ భాగంలో.. చేతిపైన మరో కత్తి గాటు అయ్యిందని వైద్యులు నిర్ధారించారు.

పోస్టుమార్టం అనంతరం వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో ఇది ముమ్మాటికే హత్యేనని నిర్ధారించారు. ఆయన శరీరంపై ఏడు చోట్ల బలమైన కత్తి పోట్లు పొడిచారని వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. పదునైన ఆయుధాలతో మొదట నుదిటిపై పొడిచారని ఆ తర్వాత కడుపు – తొడ భాగంలో పొడిచారని నివేదికలో పొందుపరిచారు.

వైఎస్ వివేకాది సహజ మరణం కాదని.. పోలీసులు కూడా వెల్లడించారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలు కూడా దొరికాయని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పష్టం చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఎవరు హత్య చేశారన్నది గుర్తిస్తామని ఎస్పీ చెప్పారు.

కాగా హత్య చేసిన ప్రాంతంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయని.. క్లూస్ కోసం వెతుకుతున్నామని ఎస్పీ రాహుల్ ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య హత్య జరిగిందని ఎస్పీ ప్రకటించారు..
Please Read Disclaimer