దొరగారి కారులో… జగన్ షికారు

0

ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తెస్తూనే మరోవైపు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ తనదైన శైలిలో వైఎస్ఆర్సీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. గంటా శ్రీనివాస రావు అలక పాన్పు ఎక్కారని సాక్షి టీవీ ప్రసారం చేసింది. బ్యాక్ గ్రౌండ్లో సాక్షి టీవీలో దీనికి సంబంధించిన బ్రేకింగ్ వస్తుండగా.. గంటాతో కలిసి దిగిన సెల్ఫీని లోకేష్ ట్వీట్ చేశారు. అవును నిజమే గంటా గారి ముఖంలో అలక చూడండంటూ.. లోకేష్ వ్యంగాస్త్రాలు సంధించారు. అవినీతి డబ్బా, అవినీతి పత్రిక.. ఫేక్ న్యూస్ సాక్షి, ఫేక్ టీవీ, ఫేక్ లీడర్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో లోకేష్ ట్వీట్ చేశారు.

వైసీపీ నేతలు ప్రచారం కోసం టీఆర్ఎస్ వాహనాలను వాడుతున్నారనే ప్రచారం నెల్లూరు జిల్లాలో జోరందుకుంది. ప్రచారం కోసం వైసీపీ సిద్ధం చేసుకున్న జిప్సీల్లో సీటింగ్ కవర్లు టీఆర్ఎస్ సింబల్‌తో ఉన్నాయ’నే స్క్రీన్ షాట్‌ను లోకేష్ ట్వీట్ చేశారు.

తెలంగాణ దొరగారి కారు…ఆంధ్రాలో జగన్ షికారు!
వైకాపా కారు చూడ మేలిమై ఉండు
సీటు విప్పిచూడ కారు గుర్తు ఉండు.
రంగు మార్చుడెందుకు కలువకుంట జగన్ గారూ,
దొరగారి ప్ర“గఢీ“భవన్ గులాబీ తోటలో పువ్వే మీరు! అనే పద్యాన్ని లోకేష్ ట్వీట్ చేశారు.
Please Read Disclaimer