అవెంజర్స్ దెబ్బ ఎలా ఉంటుంది?

0

నిన్న తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ఫీవర్ తో ఊగిపోయారు. మొదటిరోజు దాదాపుగా విడుదలైన ప్రతి స్క్రీన్ హౌస్ ఫుల్ అయిన హాలీవుడ్ మూవీగా ఇది కొత్త రికార్డు సృష్టించింది. ఓపెనింగ్ వసూళ్ళ గురించి ఏవేవో లెక్కలు బయటికి వస్తున్నాయి కాబట్టి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద సేఫ్ రన్ లో ఉన్న జెర్సీ-కాంచన 3-మజిలి- చిత్రలహరి దీని వల్ల ఎఫెక్ట్ కావడం ఖాయమని మాత్రం తెలిసిపోతోంది.

ముఖ్యంగా ఈ వీకెండ్ చాలా కీలకంగా మారిన జెర్సీకి అవెంజర్స్ కు వచ్చిన పాజిటివ్ టాక్ ప్రాణసంకటంగా మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ పిల్లలు ఇలా వారు వీరు అనే తేడా లేకుండా అందరూ పోలో మని సూపర్ హీరోస్ కోసం ధియేటర్లకు పరుగు పెట్టడంతో తెలుగు సినిమాలకు ఇబ్బంది తప్పలేదు. అందులోనూ దీని డబ్బింగ్ వెర్షన్ కూడా భారీ ఎత్తున రిలీజ్ కావడంతో మాస్ కు బాష అర్థం కాదన్న ఇబ్బంది లేకుండా పోయింది

ఇప్పటి వాస్తవ పరిస్థితిని గమనిస్తే అవెంజర్స్ ఎంత లేదన్నా పైన చెప్పిన నాలుగు సినిమాలకు కలిపి సుమారు పది కోట్ల కలెక్షన్ కు ఎసరు పెట్టనుంది. ఇది పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ఒప్పందం మీద మొదటి రోజు మాత్రమే అవెంజర్స్ వేసుకున్న కొన్ని స్క్రీన్లు వచ్చిన రెస్పాన్స్ చూశాక ఇంకో రెండు రోజులు పొడిగించుకోవడం చూస్తేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కాకపోతే త్రీడి స్క్రీన్స్ కు ఉన్న రెస్పాన్స్ సింగల్ స్క్రీన్స్ మరియు 2డిలో కనిపించడం లేదు. ఈ భీకర యుద్ధాన్ని 3డి లోనే చూడాలన్నఅభిప్రాయం బలంగా ప్రేక్షకుల్లో వెళ్ళడంతో కేవలం ఈ సౌకర్యం ఉన్న చోటే వసూళ్లు బాగున్నాయి. ఇక సోమవారం నుంచి కూడా అవెంజర్స్ ఇదే జోరు కొనసాగిస్తుందా లేదా అనే దాని మీద దీని దెబ్బ ఎంత స్థాయిలో ఉండబోతోంది అనేది అర్థమవుతుంది
Please Read Disclaimer