ఈ జిమ్నాస్టిక్ ముద్దులేంటి బాబు

0సినిమాల్లో లిప్ టు లిప్ కిస్సులు ఇప్పుడు కొత్తగా పుట్టుకురాలేదు. అప్పుడెప్పుడో 30 ఏళ్ళ క్రితమే మణిరత్నం గీతాంజలిలో చూపిస్తే ఆ తర్వాత కమల్ హాసన్ తన సినిమాల్లో ఇదేమి పెద్ద సంగతి కాదన్నట్టు ఛాన్స్ ఉన్న హీరోయిన్లు అందరిని కిస్ చేసాడు. ఇక ఇమ్రాన్ హష్మీ పాపులర్ అయ్యిందే ఈ ముద్దుల వ్యవహారం వల్ల. కానీ కేవలం వాటి కోసమే సినిమాలు ఆడటం హాలీవుడ్ లో కూడా జరగదు. ఒక పబ్లిసిటీ స్టంట్ గా వాడుకోవచ్చు కానీ దాని మీదే కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే అది వట్టి భ్రమే. ఈ మధ్య కాలంలో ప్రమోషన్ కోసం సినిమాలోని లిప్ కిస్ ని వాడుకున్న అర్జున్ రెడ్డి ఆరెక్స్ 100 లాంటి సినిమాలు విజయం సాధించాయి అంటే దానికి కారణం సబ్జెక్టు లో ఉన్న వెయిట్. అంతే తప్ప ఈ మాత్రం ముద్దులు ఆన్ లైన్ లో దొరక్క కాదు. కానీ రథం అనే సినిమా దర్శక నిర్మాతలు ఇంకాస్త ముందుకు వెళ్లి ముద్దులలో జిమ్నాస్టిక్ తీసుకొచ్చారు. పైన పోస్టర్ చూడండి మీకే క్లారిటీ వచ్చేస్తుంది.

మాములుగా ఈ భంగిమలో అమ్మాయితో ముద్దు పెట్టించుకోవాలి అంటే ప్రాక్టీస్ ఉండాలి లేదా ఇద్దరూ జిమ్ మాస్టర్లు అయ్యుండాలి. కానీ ఇలా పోస్టర్ లో ప్రత్యేకంగా చూపించారంటే కేవలం యూత్ ని ఆకట్టుకోవడానికి తప్ప మరొకటి కాదు. సినిమాలో  విషయం ఉండొచ్చేమో కానీ అటెన్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇలా డిజైన్ చేయటం వెనుక ప్లాన్ ఏమై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. ఆ మాటకొస్తే పైన చెప్పిన రెండే కాదు ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాల్లో లిప్ కిస్సులు ఉన్నాయి. అలా అని అన్ని సక్సెస్ కాలేదుగా. రథం పోస్టర్ హంగామా మధ్య రిలీజ్  చేసారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ త్వరలో విడుదల చేయబోతున్నారు. సోషల్ మీడియాలో అప్పుడే దీని మీద కామెంట్స్ మొదలయ్యాయి. అయినా ఈ ట్రెండ్ చూస్తుంటే రాను రాను యూత్ లవ్ స్టోరీస్ అన్నింటిలో ఒక ముద్దు పోస్టర్ కామన్ గా మారిపోయేలా ఉంది. అంతా కాల మహత్యం.