కాజల్ నే కొట్టేసిందిగా రకుల్

0సాధారణంగా స్టార్ హీరోల క్రేజ్ ను ఎలా కొలవాలి అంటే మార్కెట్ కంటే ముందు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ లెవెల్లో ఉంది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏ హీరో ఎప్పుడు ఎంత పెద్ద హిట్ కొడతాడో తెలియదు. ఏరియాలను బట్టి కొందరి హీరోలకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఇకపోతే హీరోయిన్స్ విషయానికి వస్తే ఆ లెక్కలు సపరేట్ గా ఉంటాయి. ఎక్కువ ఆదరణ అందుకున్న హీరోయిన్ కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న భామలే నెంబర్ వన్ అని అర్ధం.

స్టార్ హీరోయిన్ అనుష్క జానర్ వేరేది కాబట్టి ఆమెకు ఉండే ప్లేస్ సపరేట్ గా ఉంది. రెగ్యులర్ హీరోయిన్స్ విషయానికి వస్తే వారికి టాప్ రెమ్యునరేష్ రెండు కోట్లు ఎప్పుడు దాట లేదు. చాలా వరకు కోటి దగ్గరే ఆగిపోతారు. ఐటెమ్ సాంగ్ చేస్తే మళ్లీ ఆ లెక్క సపరేటే. ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటివరకు ఓ తెలుగు సినిమాకు అత్యధికంగా కాజల్ అగర్వాల్ 1.5 నుంచి 1.75 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఆమె తరువాత ఏ హీరోయిన్ కూడా అంత మొత్తంలో అందుకోలేదు.

కానీ రీసెంట్ గా రకుల్ ఆ మార్క్ ను అందుకున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ నాగ చైతన్యతో చేయబోయే సినిమా కోసం అమ్మడికి కోటి 75 లక్షలు ముట్టజెబుతున్నారట. స్పైడర్ సినిమా డిజాస్టర్ తరువాత అమ్మడికి పెద్దగా ఆఫర్స్ లేవు. కానీ బాలీవుడ్ కోలీవుడ్ లో ఆఫర్స్ అందుతుండడంతో అడిగినంత ఇచ్చి డేట్స్ సెట్ చేసుకుంటున్నారు. పైగా గతంలో చైతు – రకుల్ కాంబో లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా హిట్ అవ్వడం కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆ విధంగా రకుల్ కాజల్ అగర్వాల్ తరువాత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా రికార్డ్ కొట్టేసింది.