కృష్ణా జిల్లాలో దుమ్ము రేపేస్తోన్న బాలకృష్ణ!

0Balayyaబాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పైసా వసూల్’ నిన్ననే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి నుంచి కూడా బాలకృష్ణకి మాస్ ఫ్యాన్స్ ఎక్కువే. అలాంటి వాళ్లందరికీ ఈ సినిమా పండుగ చేస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో బాలకృష్ణ అభిమానుల సంఖ్య ఎక్కువ. అందువలన ఆయన సినిమాలు ఆ ఏరియాలో భారీ వసూళ్లనే రాబడుతూ ఉంటాయి. ‘పైసా వసూల్’ కూడా అదే విషయాన్ని మరోమారు నిరూపించింది. తొలి రోజున ఈ సినిమా అక్కడ 52,70,747 షేర్ ను వసూలు చేసింది. ఇక శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాలకృష్ణ సినిమా నుంచి ఆయన అభిమానులు ఏవైతే ఆశిస్తారో, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పూరి ఈ సినిమా చేశాడు. అదే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెస్తోందని చెప్పుకుంటున్నారు.