దుమ్ముదులిపిన దగ్గుబాటి బ్రదర్స్

0నిన్నట్నుంచి తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య-సమంత రూత్ ప్రభుల పెళ్లి గురించే చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ పెళ్లి విశేషాలే హాట్ టాపిక్. ఈ పెళ్లికి సంబంధించి నిన్న ఉదయం నుంచి వస్తున్న ఫొటోలు చూసిన వాళ్లందిరికీ ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతోంది. అంత ఆహ్లాదంగా ఉన్నాయి పెళ్లి విశేషాలు. చైతూ.. సమంత పెళ్లి బట్టల్లో వెలిగిపోయారంతే. నాగార్జున షేర్ చేసిన ఫొటోలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచాయి. పెళ్లి తంతు జరుగుతున్నప్పటికీ ఫొటోలు.. వీడియోలు కూడా అదిరిపోయాయి.

ఐతే ఈ మొత్తం ఫొటోల్లో.. వీడియోల్లో చాలా ప్రత్యేకంగా కనిపించింది మాత్రం దగ్గుబాటి బ్రదర్స్ అనే చెప్పాలి. ఓవైపు విక్టరీ వెంకటేష్.. మరోవైపు ఆయన సోదరుడు సురేష్ ఈ పెళ్లికి ప్రత్యేక ఆకర్షణ అయ్యారంటున్నారు. వెంకీ ఈ పెళ్లి మొత్తంలో చాలా ఎనర్జిటిగ్గా కనిపించాడు. పెళ్లి వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన డీజేలో వెంకీ స్టెప్పులతో ఇరగదీశాడు. మైకందుకుని పాటలు పాడాడు. వ్యాఖ్యానం కూడా చేశాడు. వెంకీ ఎంటర్టైన్మెంట్ గురించి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు మరోవైపు ఎప్పుడూ గంభీరంగా కనిపించే దగ్గుబాటి సురేష్ పెళ్లి వేడుకలో తనలోని మరో యాంగిల్ చూపించారు. ఆయన సమంతతో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. మొత్తానికి తమ మేనల్లుడి పెళ్లి వేడుకలో దగ్గుబాటి బ్రదర్స్ మామూలుగా రచ్చ చేయలేదన్నమాట.Suresh-Babu-Dances-with-Sam