పిల్లాడికి పాలిస్తూ.. లీసా హడెన్ మెసేజ్!

0Lisa-Hayden-shares-Breastfeeding-Picఇప్పటి అందాల ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు తల్లి అవ్వాలి అంటే భయపడుతున్నారు. తల్లి అవ్వాలి అని ప్రతి అమ్మాయి లోపల అనుకున్న ఆ అమ్మతనం బిడ్డకు అందించడానికి మొదటిలో భయపడతారు. కొంతమంది ఆ భయం వలనే అమ్మతనానికి దూరంగా ఉంటారు. దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తారు. ఒక సాధారణ అమ్మాయే ఇలా అనుకుంటే అందాల ప్రపంచంలో ఉన్న మోడల్ హీరోయిన్లు పరిస్థితి ఇంకా ఎలా ఉంటుంది. అమ్మ అయితే అందం పోతుంది మళ్ళీ అందంగా కనిపించడానికి చాలా కష్టపడాలి అని అనుకుంటారు కానీ ‘క్వీన్’ సినిమాతో బాలీవుడ్ సినిమాకు దగ్గరైన లీసా హెడన్ ఈ మధ్యనే తల్లి అయ్యింది. తన బిడ్డకు తన తల్లిపాలు ఇస్తూ ఆమె ఆనందిస్తూ తనలాంటి కొంతమందికి ప్రేరణ ఇచ్చింది.

లీసా హెడన్ ఇటీవల ఒక పోస్ట్ చేసింది తన బుడతడు జాక్ కి పాలు ఇస్తూ. ఈ పోస్ట్ కి సోషల్ మీడియాలో లీసా అమ్మతనాన్ని గొప్పగా పొగిడేశారు. తల్లి పాలు ఇవ్వడానికి చాలామంది నిరాకరిస్తున్న ప్రపంచంలో ఈమె తల్లి పాలు యొక్క ప్రాముఖ్యత ఎంతో చెప్పింది తన పోస్ట్ ద్వారా. “ప్రసవం తరువాత వచ్చే సాదకబాధలు పై నేను చాలా ఆందోళన పడ్డాను. కానీ అతికష్టం మీద మళ్ళీ నా ఫిట్నెస్ సంపాదించాను. అంతే కాకుండా ఇది ఒక అద్భుతమైన అనుభూతి. మన పిల్లలుకు తల్లి పాలు ద్వారానే మంచి పోషకాలు ఇవ్వగలుగుతాము. ఇంకా ఇదే మన బందం కూడా గట్టిపడటానికి దోహదపడుతుంది” అని చెప్పింది.

లీసా హడెన్ చేసిన పోస్ట్ కి ఆన్ లైన్ లో మంచి స్పందన వచ్చింది. అందరూ ఆమె చేసిన పనిని మెచ్చుకున్నారు. కొంతమంది అయితే “ఇలాంటి విషయాలును దైర్యంగా చెప్పినందుకు మీకు నా శుభాకాంక్షలు అని చెప్పారు.” మరి కొందరు అయితే తల్లి పాలు ప్రాముఖ్యత గురించి దాని అవసరం గురించి చెప్పినందుకు నీలాంటి వారు దాన్ని పని కట్టుకొని తల్లి పాలు ఇవ్వటం ఇంకా బాగుంది అని అంటున్నారు. టైమ్ వేస్ట్ అనుకునే వారికి మీరు ఒక మంచి ఉదాహరణ అని కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో మంచి పోస్ట్ చేసి కూడా చెడ్డ అయనవారు చాలనే ఉన్నారు. లీసా పోస్ట్ చేసింది అమ్మతనం కాబట్టి అందులో దైవత్వం ఉంది కనుక మనవాళ్లు అందులో బూతు ని వెతకలేక పోయారు. బాగుంది అన్నీ అలా ఆలోచించి కామెంట్లు పెడుతూ ఉండండి ఇకనుండి.