రకుల్ ఘాటుతనం

0హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంటోంది. టాలీవుడ్ లో ఆమెకు వరుసగా డిజాస్టర్స్ వచ్చినప్పటికీ మిగతా భాషల్లో ఆఫర్లను బాగానే అందుకుంటోంది. ఇక ఫోటో షూట్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. క్రేజ్ ఎలా ఉన్న కూడా ప్రముఖ మ్యాగజిన్ కవర్స్ పై అమ్మడు హాట్ గా కనిపిస్తోంది. పైగా ఎదో నార్మల్ గా కనిపిస్తోంది అంటే అది కాదు. తెలుగు ఆడియెన్స్ చూసి షాక్ అవుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు సినిమాల్లో కనిపించని విధంగా రకుల్ ఇటీవల ఫిల్మ్ ఫెర్ మ్యాగజిన్ కి ఒక స్టిల్ ఇచ్చింది. అందులో రకుల్ చాలా హాట్ గా కనిపించిందనే చెప్పాలి. సరికొత్త ఫ్యాషన్ డ్రెస్ లో.. లో దుస్తులు కనిపించేలా హాట్ గా ఇచ్చిన లుక్స్ నెటిజన్స్ కి చెమటలు తెప్పిస్తున్నాయి. రకుల్ అందంలో ఇంత ఘాటుతనం ఇప్పటి వరకు చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. లెగ్స్ అందాలను కవర్ చేసినప్పటికీ అమ్మడు తన హవాబావాలతోనే గ్లామర్ షోని గట్టిగా తగిలించేసింది.

ప్రస్తుతం అందుకు సంబందించి ఫొటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇకపోతే రకుల్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్ లో మూడు సినిమాలను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.