సాహోలో ఆమె పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ..

0Shraddha-Kapoor-in-Prabhas-ప్రస్తుత రోజుల్లో భారీ సినిమాలు తెరకెక్కించడం ఒక ఎత్తైతే సినిమాకు ప్రమోషన్స్ చేయడం మరోక ఎత్తు అని చెప్పాలి. అంతే కాకుండా సినిమా షూటింగ్ జరుపుతున్నా ఎదో ఒక విషయాన్ని జనాలకు తెలియజేస్తూ.. సినిమా కు హైప్ తెస్తూ.. ఉండాలి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఎదో ఒక న్యూస్ తో హల్ చేస్తూనే ఉండాలి. ఫైనల్ గా జనాలు సినిమాను మర్చిపోకూడదు. రిలీజ్ అయ్యేవరకు వారి మదిలో సినిమాను ఉండనివ్వలి.

ఈ మధ్య టాలీవుడ్ అదే బాటలో ప్రయాణిస్తోంది. ముఖ్యంగా బాహుబలి విషయంలో జక్కన్న ఆలోచన చాలా వరకు సక్సెస్ అయ్యింది. సినిమా షూటింగ్ సమయాల్లో ఉన్నపుడు సినిమాకు సంబందించి ఎదో ఒక విషయాన్ని చెబుతూ.. భారీగా హైప్ ని పెంచింది. ఇప్పుడు అదే తరహాలో చాలా మంది చేస్తున్నారు. ప్రభాస్ సాహో విషయంలో కూడా దర్శక నిర్మాతలు అదే బాటలో నడుస్తున్నారు. ముఖ్యంగా కేరెక్టర్స్ విషయంలో ఎదో న్యూస్ ని మీడియాకు వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇక హీరోయిన్ శ్రద్ధ కపూర్ విషయంలో అయితే గాసిప్స్ చాలా ఎక్కువయ్యాయి. అమ్మడు సౌత్ లో మొదటి సారి అడుగు పెడుతుండడంతో ఆమె పై అందరి ద్రుష్టి ఉంది. దీంతో సాహో లో శ్రద్దా పాత్రపై రకరకాలుగా రూమర్స్ వచ్చాయి.

మొదట అమ్మడు డ్యూయల్ రోల్ చేస్తోందని అలాగే ఒకే పాత్ర గాని రెండు కోణాల్లో కనిపించబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ విషయం శ్రద్దా కి అర్ధం కాలేదట. అలా ఎందుకు క్రియేట్ చేయడం ముందే తెలుస్తే కిక్ ఏముంటుంది అని కొంచెం డిస్సపాయింట్ అయ్యిందట. సినిమాలో శ్రద్దా అసలైతే పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు నిజం కూడా చెప్పేసింది. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణను కూడా తీసుకుంటోంది. మరి అమ్మడి పాత్ర ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.