18ఏళ్ల అమ్మాయి యువకుడి వేషంలో ఏం చేసిందంటే…

0Hot-Anchor-to-Go-for-Cosmet18 ఏళ్ల అమ్మాయి యువకుడిలా వేషం మార్చుకొని… ఇద్దరు మైనరు బాలురతో కలిసి చోరీలు చేసిన ఘటన చెన్నై నగరంలో వెలుగు చూసింది. చెన్నై నగరం పరిధిలోని కొండితోపే ప్రాంత బేతనాయకన్ వీధిలో 60 ఏళ్ల మణివణ్ణన్ అనే వ్యాపారి ఇంట్లో అలికిడి అయింది. ఓ బాలుడు బ్యాగుతో పరారవడం చూసి మణివణ్ణన్ అలారం మోగించగా స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడిని ప్రశ్నించగా అమ్మాయి దొంగల ముఠా బాగోతం వెలుగుచూసింది. 18 ఏళ్ల అమ్మాయి ఇద్దరు బాలురతో కలిసి ముఠాను ఏర్పాటు చేసి ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లను చోరీ చేస్తున్నట్లు తేలింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, ఐ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ న్యాయవాది ఇంట్లోనూ వీరు చోరీ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.