ఈనెల 7న ‘అజ్ఞాతవాసి’ తొలి పాటను విడుదల

0pspk-25thపవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈనెల 7న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయనున్నారు. పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్‌ పోస్టర్‌తో పాటు, మ్యూజికల్‌ సర్‌ప్రైజ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ‘బయటకొచ్చి చూస్తే’ అంటూ సాగే పాటను అనిరుధ్‌ పాడుతూ కనిపించారు. అయితే ఇప్పుడు ఆ పూర్తి పాటను నవంబర్‌ 7న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. మరి నవంబర్‌ 7న సినిమా టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు, ఇంకేదైనా సర్‌ప్రైజ్‌ ఇస్తారేమో చూడాలి. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.