అతని మరణంతో 2.0 కథ మొదలు

0

సూపర్ స్టార్ రజనీకాంత్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సై-ఫై చిత్రం ‘2.0’. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్ల రూపాయలపైనేనని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సినిమా ఎలా ఉండబోతోందో టీజర్.. ట్రైలర్ల ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. పక్షి రాక్షసుడిలా మారి జనాల స్మార్ట్ ఫోన్లు లాగేసుకుంటూ భీభత్సం సృష్టిస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఆటకట్టించేందుకు చిట్టి రోబో 2 పాయింట్ ఓ వెర్షన్ ను బయటకు తీస్తాడు సైంటిస్ట్ వశీకర్. ఇక 3డీలో… వీఎఫెక్స్ మాయాజాలంలో వీరిద్దరి ఫైట్ తెరకెక్కించాడు శంకర్.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకు వచ్చింది. ఈ సినిమా అక్షయ్ కుమార్ మరణంతో స్టార్ట్ అవుతుందట. మొబైల్ ఫోన్ విపరీతంగా వాడడంతో రేడియేషన్ తో చనిపోతాడట. ఆ తర్వాత ఓ దుష్టశక్తిగా మారి ఫోన్లు వాడే జనాల వెంటబడతాడట. ఈ లెక్కన శంకర్ ఆడియన్స్ కు షాక్ ఇచ్చి కథ మొదలుపెడతున్నట్టే. జనాలందరూ స్మార్ట్ ఫోన్లకు విపరీతంగా అడిక్ట్ అయిపోయిన ఈ తరుణంలో సరిగ్గా అదే పాయింట్ ఎంచుకోవడం.. దాని ప్లస్ లు మైనస్ లపై ఫోకస్ చేస్తూ ఓ విజువల్ వండర్ తీర్చిదిద్దడం ఇంట్రెస్టింగే కదా.

ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer