2.0 టీజర్ రివ్యూ : చాలా గ్రాండ్ ఉందిగా..

0సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా తమిళ్ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ చిత్రం 2.ఓ. తెలుగు తమిళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, ఈ ఏడాది చివరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

కాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ బాగా అక్కటుకున్నే విధంగా ఉంది. మెయిన్ గా మొబైల్స్ ఎగిరిపోవడం.. మనుషుల గాలిలోకి తేలిపోవడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మొత్తగానికి విజువల్‌ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తో అంచనాలను బాగానే పెంచింది.