రజనీ ఫ్యాన్స్ కు మళ్లీ చేదు వార్తే..

0గత కొన్ని రోజులుగా రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 2.0 చిత్రం కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియంది కాదు. ఈ మూవీ కి సంబదించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన దానిని వైరల్ గా మారుస్తున్నారు. ఈ నేపథ్యం లో ఐపీల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో 2.ఓ టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తున్నారనే వార్త బయటకు వచ్చింది. ఈ వార్త ఆలా బయటకు వచ్చిందో లేదో అందరూ ఇది నిజమే అనుకోని ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. నిర్మాణాంతార కార్య‌క్ర‌మాలు పూర్తైన త‌ర్వాత డైరెక్ట్‌గా ట్రైలర్‌నే విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా , రజనీ సరసన అమీ జాక్సన్ నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా క‌నిపించ‌నున్నారు. ఆగస్టులో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.