సంక్రాంతికి వచ్చే సినిమాల రిలీజ్ డేట్స్

0khaidi-gautamiputra-satakar2017 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కాబోయే మూడు సినిమాలలో రెండు సినిమాల సెన్సార్ లు పూర్తయ్యి, బరిలో దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే సెన్సార్ పూర్తి కాకపోయినా… ఆ సినిమా రిలీజ్ డేట్ పైనే ఇతర రెండు సినిమాలు ఆధారపడి ఉండడంతో, ఇప్పటివరకు విడుదల తేదీలను ప్రకటించలేకపోయారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం మూడు సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు అయ్యాయని తెలుస్తోంది.

మూడు సినిమాలలో చివరగా సెన్సార్ పూర్తి చేసుకోబోయే సినిమా బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” అన్నింటి కంటే ముందుగా… అంటే జనవరి 12వ తేదీన విడుదల చేయాలని సంకల్పించారని సమాచారం. నిజానికి తిరుమలలో దర్శనం చేసుకున్న బాలకృష్ణ కూడా ఈ విషయాన్ని తెలిపారు. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా గ్రాఫిక్స్ వర్క్ ఇంకా జరుగుతుండడంతో, సెన్సార్ పూర్తయిన తర్వాత మాత్రమే అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి మెగా మూవీ “ఖైదీ నంబర్ 150”ని జనవరి 13వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. పండగ ‘క్లీన్ స్వీప్’ చేసే విధంగా ఫక్తు మాస్ మసాలా అంశాలతో ప్రేక్షకులను అలరించడానికి వీకెండ్ విడుదలకు మెగా కాంపౌండ్ సన్నాహాలు చేస్తోందని టాక్. ఇక, రెండు పెద్ద సినిమాల మధ్యలో శర్వానంద్ ‘శతమానం భవతి’ సినిమాను జనవరి 14వ తేదీన విడుదల చేసేందుకు దిల్ రాజు ఇప్పటికే నిర్ణయించినట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం.