జనవరి 2019 ‘క్రిష్ మంథ్’

0

టాలీవుడ్ పేరు చెబితే అరుదైన ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా క్రిష్ పేరు వినిపిస్తుంది. రొటీన్ కి భిన్నంగా ఆలోచించగలిగే – గ్రిప్పింగ్ గా కథని నేరేట్ చేసే సత్తా ఉన్న దర్శకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. గమ్యం – కృష్ణంవందే జగద్గురుమ్ – గౌతమి పుత్ర శాతకర్ణి.. ఇవన్నీ క్రిష్ లోని వైవిధ్యానికి నిదర్శనం. కథల ఎంపికలో – ఆలోచనల్లో రొటీనిటీకి దూరంగా ఉండే ప్రతిభావంతుడు. అందుకే అతడు బాలీవుడ్ లోనూ సినీదిగ్గజాల్ని ఆకర్షించగలిగాడు.

పెళ్లి తర్వాత మునుపటితో పోలిస్తే కెరీర్ పరంగా పూర్తి బిజీ అయిపోయాడు క్రిష్. గౌతమిపుత్ర శాతకర్ణి టైమ్ లో బ్యాచిలర్ షిప్ ని వదిలేసిన క్రిష్ – ఆ తర్వాత బాలీవుడ్ లో `మణికర్ణిక` లాంటి క్రేజీ ప్రాజెక్టును చేపట్టాడు. ఆ రోజుల్లో కే.వి.రెడ్డి అంతటి వారి క్రమశిక్షణ క్రిష్ కి ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. క్రిష్ రాజీకి రాని తత్వం వల్లనో ఏమో కంగనతో గొడవపడాల్సొచ్చింది. మొత్తానికి `మణికర్ణిక` చిత్రానికి కర్త కర్మ క్రియ క్రిష్ మాత్రమేనని కంగనయే అంగీకరించింది. టైటిల్స్ లోనూ క్రిష్ పేరు దర్శకత్వం కార్డ్ లో పడుతుందని క్లారిటీ ఇచ్చేసింది.

అదంతా సరే.. 2019 జనవరిని క్రిష్ క్లీన్ స్వీప్ చేస్తున్నాడు తెలుసా! జనవరి మాసానికి `క్రిష్ మంథ్` అని పేరు పెడితే తప్పేం లేదు. ఎందుకంటే ఒకే నెలలో క్రిష్ దర్శకత్వం వహించిన మూడు క్రేజీ చిత్రాలు రిలీజవుతున్నాయి. జనవరి 9న ఎన్టీఆర్ -బయోపిక్ పార్ట్ 1 (కథానాయకుడు) – జనవరి 24న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 (మహానాయకుడు) రిలీజ్ కానున్నాయి. జనవరి 25న `మణికర్ణిక` రిలీజ్ కానుంది. ఈ మూడు సినిమాలు అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజవుతున్నాయి. వీటిపై వందల కోట్ల బిజినెస్ సాగుతోంది. అందుకు తగ్గట్టే వందల కోట్ల వసూళ్లు తేగలవని ట్రేడ్ అంచనా వేస్తోంది. అందుకే జనవరి క్రిష్ మంథ్ అని డిక్టేర్ చేయొచ్చు.
Please Read Disclaimer