రైలు పట్టాలపై సెల్ఫీ.. ముగ్గురు మృతి

0Selfie-Deathసెల్ఫీ సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన బెంగళూరుకు సమీపంలోని బిదాబి వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. బిదాబి రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైలు వస్తుండగా.. ముగ్గురు విద్యార్థులు కలిసి రైలు పట్టాలపై సెల్ఫీ దిగేందుకు యత్నించారు. సెల్ఫీ మోజులో పడిన విద్యార్థులను అతివేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు బెంగళూరుని నేషనల్ కళాశాలలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.