40 ప్లస్ మామ్స్ అగ్గిమీద గుగ్గిలం

0

40 ప్లస్ మామ్స్.. అంతర్జాలాన్ని ఒణికిస్తున్నారు. అప్పటి కే పెళ్లయి ఇద్దరు బిడ్డలకు మమ్మీస్ అయినా గ్లామర్ ప్రపంచాన్ని రఫ్ఫాడించేస్తున్నారు. కొందరు సినీ గ్లామర్ తళుకు బెళుకుల మాటున ఇండస్ట్రియలిస్టులు గా పలు రకాల వ్యాపారాల్లో వృత్తి నైపుణ్యంతో వేడి పెంచేస్తూ భారీ గా ఆర్జిస్తుంటే.. ఇంకొందరు మామ్స్ తామే టీనేజీ గాళ్స్ గా చెలామణి అయిపోతూ ముఖానికి రంగేసుకుని నటించేస్తున్నారు. మొత్తానికి ఈ యాక్టివ్ మామ్స్ వెరీ హాట్.

ఐష్ మలైకా.. సుజానే ఖాన్ బిపాసా మాధురి ధీక్షిత్ శిల్పాశెట్టి కరీనాకపూర్ కరిష్మా కపూర్ రవీనా టాండన్ .. వీళ్లంతా 40 వయసులోనూ అగ్గి రాజేస్తూ యువతరం కళ్లు తమవైపు తిప్పేసుకుంటున్నారు. ఐశ్వర్యారాయ్ నిరంతరం మ్యాగజైన్ కవర్ షూట్ల తో ఆకట్టుకుంటోంది. కూతురు ఆరాధ్యతో కలిసి ట్రెడిషనల్ గా దర్శనమిస్తూనే కవర్ షూట్లతో వేడెక్కిస్తోంది. ఇక మలైకా అరోరాఖాన్ గురించి చెప్పాల్సిన పనేలేదు.

కుర్ర హీరో అర్జున్ కపూర్ తో ఎఫైర్ సాగిస్తున్న ఈ హాట్ మమ్మీ తన తాజా చర్యకు పలువురి నుంచి సపోర్టును దక్కించుకుని ఆశ్చర్యపరుస్తోంది. హృతిక్ మాజీ భార్య సుజానే ఖాన్ ఇండస్ట్రీ లో బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్. కింగ్ ఖాన్ షారూక్ భార్యామణి గౌరీఖాన్తో కలిసి టాప్ హోమ్ డెకరేటర్ ఇండస్ట్రీని రన్ చేస్తోంది. ఇక బిపాసా బసు భర్త తో కలిసి రకరకాల వ్యాపారాల్లో తలమునకలుగా ఉంది.

శిల్పాశెట్టి కరీనాకపూర్ రవీనా సైతం నిరంతరం తమ హాట్ లుక్స్ తో యూత్ ని తమవైపు తిప్పేసుకోవడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్. శిల్పాజీ క్రికెట్ రేసింగ్ బిజినెస్లలో ఘనాపాటి. ఇక ఇతర భామలు పలురకాల వ్యాపారాల్లో తలమునకలుగానే ఉన్నారు. ఇటీవల కరిష్మా తన సోదరి కరీనాతో కలిసి ఫోటో షూట్ల తో వేడి పెంచుతోంది. బెబో కరీనా సైతం సైఫ్ అలీఖాన్ని పెళ్లాడి తైమూర్ రాజావారికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ హాట్ మామ్ కథానాయిక గానూ వేడి పెంచేందుకు నిరంతరం ప్రణాళికల్లో ఉంది. పెళ్లయితే నాకేంటి? రంగుల ప్రపంచంలో సంపాదిస్తే తప్పేంటి? అన్నట్టే ఉంది వీళ్ల వాలకం.
Please Read Disclaimer