ఆ చిన్నారి మాటలకు చిరు ఫ్యాన్స్ ఫిదా!

0ముద్దులొలికే చిన్నారి మాటలకు చిరు ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఆ పాప గురించి పదే పదే చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. తమ అభిమాన నటుడు కమ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమా పేర్లను గుక్క తిప్పుకోకుండా చెప్పేసిన వైనం మంత్రముగ్థుల్ని చేస్తోంది.

ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఎక్కడ తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిందన్న విషయంలోకి వెళితే.. మంగళవారం రాత్రి చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక చిన్నారి పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచి.. చిరు అభిమానుల్ని సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది.

విజయవాడకు చెందిన ఏడేళ్ల చిన్నారి హాసిని. ఈ పిడుగు స్పెషాలిటీ ఏమంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమా పేర్లను.. వాటి రిలీజ్ డేట్ల ను సైతం గుక్కతిప్పుకోకుండా చెప్పటం అందరిని ఆకర్షించింది. అంతేనా.. సినిమా పేర్లు.. రిలీజ్ డేట్లతో పాటు.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్స్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇలా అన్ని వివరాల్ని చెప్పేయటం ఆమె గొప్పతనంగా చెబుతున్నారు.

చిరు 150 చిత్రాల వివరాల్ని చిన్నారి నోటి నుంచి అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్లటం చిరు ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. టైం సరిపోకపోవటంతో ఆ వివరాల్ని చెప్పించకుండా కేవలం సినిమా పేర్లను మాత్రమే చెప్పించారు. ఆ చిన్నారి మెమరీ చిరు ఫ్యాన్స్ నే కాదు.. అందరిని తెగ ముచ్చట పడేలా చేసింది. చిరు బర్త్ డే సందర్భంగా చిన్నారి కార్యక్రమం హైలెట్ గా మారిందని చెప్పక తప్పదు.