మిలియన్ల వర్షంలో నర్తనశాల

0ఇప్పటి తరం ప్రేక్షకులు కంటెంట్ కే పట్టం కడుతున్నారన్నది నిజం. హీరో ఎవరు అనే దాని కన్నా సినిమాలో ఏం చూపించబోతున్నారు గతంలో ఎలాంటిది అందించారు అనే దానికె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నాగ శౌర్యకు ఇది ప్రత్యక్షంగా అనుభవమవుతోంది. తన తాజా చిత్రం @నర్తనశాల టీజర్ వీడియో సాంగ్ కు విశేష ఆదరణ దక్కడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పటికే ఎగిరెనే మనసు పాట 7 మిలియన్ల వ్యూస్ దాటేయగా టీజర్ కూడా అంతే ఫిగర్స్ నమోదు చేస్తూ దానికి పోటీగా దూసుకుపోతోంది. అది కూడా వారం లోపే ఈ ఫీట్ సాధించడం విశేషం. దీనికి కారణాలు స్పష్టం. ఛలో తర్వాత నాగ శౌర్య-మహతి స్వర సాగర్ కాంబో రిపీట్ కావడం ప్లస్ కాగా ఇది కూడా అదే బ్యానర్ ఐరా నిర్మాణంలో రూపొందటం. వీటి వల్లే @నర్తనశాలకు హైప్ పెరుగుతోంది.

నాగ శౌర్య సేఫ్ గేమ్ ఆడకుండా రిస్క్ తీసుకుని అమ్మాయి మనస్తత్వం ఉన్న అబ్బాయి పాత్రలో కొత్త తరహాగా ట్రై చేసాడు. గతంలో చిరంజీవి చంటబ్బాయ్ లో ఓ పాటలో సీనియర్ నరేష్ చిత్రం భళారే విచిత్రంలో పూర్తి వేషంలో ఇలాంటివి చేసారు కానీ వాటికి @నర్తనశాలకు కీలకమైన తేడా ఉంది. నాగ శౌర్య గెటప్ మార్చకుండా కేవలం ప్రవర్తన మాత్రమే అలా ఉండేలా దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దీన్ని తీర్చిదిద్దారట. సో నాగ శౌర్య పాత్రలో తేడా ఉన్నా అది బాడీలో లేకుండా జాగ్రత్త పడ్డారు. డాన్సింగ్ స్కూల్ నడిపే పాత్రలో నాగ శౌర్య నటిస్తుండగా అతనికి జోడిగా కశ్మీరా షా-యామిని భాస్కర్ జట్టు కడుతున్నారు. యుట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో అదరగొడుతున్న @నర్తనశాల పూర్తి ఆల్బం ట్రైలర్ వచ్చాక అంచనాలు ఇంకా పెరిగేలా ఉన్నాయి.