81 ల‌క్ష‌ల ఆధార్ కార్డులు ర‌ద్దు..

081-lakh-aadhar-numbers-deacయూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా సుమారు 81 ల‌క్ష‌ల ఆధార్ కార్డుల‌ను ర‌ద్దు చేసింది. ఆధార్ రెగ్యులేష‌న్స్ 2016లోని సెక్ష‌న్ 27, 28 సూచించిన‌ వివిధ కార‌ణాల వ‌ల్ల ఈ కార్డుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు యూఐడీఏఐ వెల్ల‌డించింది. మ‌రి మీ ఆధార్ కార్డు యాక్టివ్‌గా ఉందా లేదా అన్న‌ది తెలుసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..

– యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఉండే వెరిఫై ఆధార్ నంబ‌ర్ అన్న ఆప్ష‌న్ ద్వారా స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు.

– https://resident.uidai.gov.in/aadhaarverification ఈ లింక్ ఓపెన్ చేస్తే నేరుగా అక్క‌డికే వెళ్తారు.

– అక్క‌డ మీ ఆధార్ నంబ‌ర్‌తోపాటు ఓ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. అది ఎంట‌ర్ చేయాలి.

– ఒక‌వేళ మీ ఆధార్ యాక్టివ్‌గా ఉంటే.. వెంట‌నే ఆ మెసేజ్ డిస్‌ప్లే చేస్తుంది. మీ వ‌య‌సు, రాష్ట్రం, మీ మొబైల్ నంబ‌ర్‌లోని చివ‌రి మూడు నంబ‌ర్ల‌ను చూపిస్తుంది.

– యాక్టివ్‌గా లేక‌పోతే దానికి సంబంధించిన మెసేజ్ వ‌స్తుంది.