1996 లోకెళ్తున్న సేతుపతి-త్రిష

0విజయ్ అనే పేరు పెట్టుకున్నవాళ్ళందరూ యాక్టింగ్ లో ఇరగదీయడమో లేదంటే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమో పనిగా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి సంగతే తీసుకుంటే తన యాక్టింగ్ తో టాప్ హీరోలతో శభాష్ అనిపించుకున్నాడు. మనకు సెన్సేషన్ విజయ్ దేవరకొండ అయితే తమిళంలో సెన్సేషన్ విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి – త్రిష లు జంటగా నటించిన తమిళ చిత్రం ’96’ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో.. సారీ తప్పయింది.. అదే ‘నెంబర్’ తో రిలీజ్ చేస్తారట. ’96’ టీమ్ ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. విజయ్-త్రిష లను మూడు దశలలో ఇంటర్ కట్స్ లో చూపించాడు దర్శకుడు. ఒకటేమో 1996 లో స్కూల్ దశలో స్టూడెంట్స్ గా ఉన్నపుడు జరిగిన ఫ్లాష్ బ్యాక్. అప్పుడు విజయ్-త్రిష ల రోల్స్ వేరే టీనేజ్ యాక్టర్స్ చేశారు. ఆ తర్వాత సేతుపతి లాంగ్ హెయిర్ – ఫుల్ గా గడ్డం పెంచుకుని ఉన్నాడు. మరో గెటప్ లో క్లీన్ షేవ్ లో ఉన్నాడు కానీ లాంగ్ హెయిర్ కంటిన్యూ అయింది. ఈ గెటప్ లో హాండ్సమ్ గా ఉన్నాడు.

హీరో పాత్ర పేరు రామ్.. హీరోయిన్ పేరు జాను. అది ఇప్పటి లవ్వు కాదు కదా జిమ్నాస్టిక్ ముద్దులు పెట్టుకునేందుకు. 96 జెనరేషన్ లవ్వు. సో.. అంతా చూపులే. రామ్ చూస్తాడు.. జాను చూస్తుంది.. మహా అంటే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటారు. అది మరి మీరు కూడా మౌస్ కర్సర్ ను పట్టుకోండి.. ట్రైలర్ చూడండి!