ఈగ తరువాత పీత వస్తోంది

0Jithan-Rameshమన సినిమాలలో మన హీరో హీరోయిన్లు మధ్య ప్రేమకు ఆటంకాలు వస్తాయి కొన్నిసార్లు వాటిని వాళ్ళే పరిష్కరించుకుంటే కొన్నిసార్లు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ కొన్ని సినిమాలలో జంతువులు కూడ ఆ ప్రేమ జంటను కలుపుతాయి. ముందు ఒక ప్రేమ జంటను కలిపే జంతువుగా పావురం ఉంటే ఆ తరువాత కుక్క ఏనుగు కూడా తెర పైకి వచ్చాయి. ఈ మధ్య రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈగ సినిమా కూడ ప్రేమ జంటను కలిపే సాధనంగా వాడకపోయినా ప్రేమను చెప్పడానికి మాత్రం దాన్ని అద్భుతంగా వాడేశాడు. ఇప్పుడు అలాంటి తరహాలోనే ఒక సముద్ర జీవి ఒక ప్రేమ జంటను కలపబోతుంది.

‘జిత్తన్’ అనే తమిళ్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ్ నటుడు రమేష్. ప్రస్తుతం ‘నండు ఎన్ నన్బన్’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో రమేష్ కు జోడీగా పూనం కౌర్ నటిస్తుంది. ‘ఆసామి’ ‘ఇన్నారుక్కు ఇన్నారెండ్రు’ చిత్రాల దర్శకుడు ఆండాల్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాము – మేక – ఏనుగు లాంటి జంతువులతో చాలా సినిమాలు చేశారు కానీ పీత ని పెట్టి ఎవరు ఇంతవరకు సినిమాను నిర్మించలేదు. రోజు బీచ్ కు వెళ్ళే ఒక అమ్మాయికి అక్కడ ఉన్న ఒక పీతతో స్నేహం ఏర్పడుతుంది. ఒకసారి ఆమె ప్రియుడు కనిపించకుండా పోతాడు అదే విషయం పీతకు చెబితే ఆమె స్నేహం కోసం ఆ పీత ఎటువంటి సాహసాలు చేసి ఆ ప్రేమ జంటను కలిపింది అనేది స్టోరీయట.

ఈగ సినిమా మాదిరి గ్రాఫిక్స్ సన్నివేశాలతో ఈ సినిమా అదిరిపోతుంది అంటూ ఇప్పుడు ఈ హీరో అండ్ డైరక్టర్ తెగ చెప్పేస్తున్నారు. మొత్తానికి ఒక జంతువుతో కొత్తరకం హిట్టు కొట్టి రాజమౌళి ప్రూవ్ చేసుకుంటే.. ఇక్కడ రవిబాబు పందిపిల్లను తెచ్చాడు అక్కడ వీళ్ళు పీతను తెస్తున్నారు.