ఆడై ఫస్ట్ లుక్: ఇంటెన్స్ ఎమోషన్ లో అమల

0గతంలో మన బాషకు సంబంధించిన సినిమాల సంగతులు మాత్రమే మనం చెప్పుకునే వాళ్ళం. తెలుగుప్రేక్షకులలో పాపులర్ అయిన తమిళ స్టార్ హీరో అయితే తప్ప తమిళ సినిమాల ఫస్ట్ లుక్ లు పెద్దగా చర్చనీయాంశం అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా జెనరేషన్ లో భాషా భేదాలు చెరిగిపోయాయి. ఏ భాషలో ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ వచ్చినా అందరూ ఆ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

అమల పాల్ నటించిన తాజా తమిళ చిత్రం ‘ఆడై'( ఇంగ్లీష్ లో అయితే మీనింగ్ డ్రెస్… తెలుగులో అయితే దుస్తులు) ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. దెబ్బలు తగిలి రక్తం కారుతూ.. పెద్దగా ఏడుస్తూ ఒక ఇనప రాడ్ ను పట్టుకొని ఎడమ మోకాలును నెలకు ఆనించి కూర్చుంది. ఇక బట్టలంతా చిరిగిపోయి ఉన్నాయి. వాటిని కరెక్ట్ గా అయితే బట్టలు అనలేం… మానం కాపాడుకొనేందుకు గుడ్డపేలికలను శరీర భాగాలకు చుట్టుకుంది అంతే.

ఫస్ట్ లుక్ ను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు విడుదల చేయగా గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా క్యాప్షన్ యారోగెంట్.. అడాషియస్.. ఆర్టిస్టిక్. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అమలదే. రత్న కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో అయన ‘మెయాదామాన్’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. వీ స్టూడియోస్ వారు ఈ సినిమాకు నిర్మాతలు .