సిట్టిబాబు అన్నయ్యకు ఛాలెంజే!

0హీరోగా కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి మళ్ళి హీరోగా అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా చేసిన నీవెవరో ఈ నెల 23న విడుదల కానుంది. తన కెరీర్ మొదట్లో మృగం-మలుపు-ఏకవీర లాంటి చెప్పుకోదగ్గ సినిమాలే చేసినప్పటికీ అవేవి ఆశించిన పేరు తీసుకురాలేదు. విలన్ గా సరైనోడు ఇచ్చిన బ్రేక్ తో వేగం పెరిగిన ఆది గ్రాఫ్ రంగస్థలంలో రామ్ చరణ్ అన్నయ్య కుమార్ బాబు పాత్రతో అమాంతం ఎగబాకింది. ప్రేక్షకులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనను బాగా గుర్తించారు. ఇప్పుడు వస్తున్న నీవెవరోలో మాత్రం ఆదినే హీరో. తాప్సీ పన్ను-రితిక సింగ్ హీరోయిన్లు. కోన వెంకట్ రచనలో హరినాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థ్రిల్లర్ జానర్ లో వస్తోంది. కాకపోతే హీరో పాత్రకు కళ్ళు కనిపించవని తెలిసింది. మరి ఇలాంటి రోల్ లో ఆది పినిశెట్టి మెప్పించడం అంటే ఛాలెంజ్ లాంటిదే. నటన పరంగా ఆది గురించి కంప్లైంట్ లేదు. నిన్ను కోరిలో నానికి పోటీగా సాలిడ్ గా నటించి మెప్పించాడు.కానీ కేవలం తన ఒక్కడి భుజాల మీద సినిమా నడిపించే రేంజ్ కు ఇంకా చేరుకోలేదు.

దానికి తోడు తాప్సీకి  ఇక్కడ ఏమంత క్రేజ్ లేదు. హిందీలో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పటికీ తెలుగులో మాత్రం ఏడాదికి ఒకటి  చేయటమే కష్టంగా మారింది. ఇక రితిక పరిస్థితి కూడా అంతే. గురు శివలింగ తర్వాత పెద్దగా కనిపించింది లేదు. ఇలా ఏ కోణంలో చూసినా నీవెవరోకి బజ్ రావడం కష్టంగానే ఉంది. దానికి తోడు సినిమాను జనంలోకి తీసుకెళ్లే  క్రమంలో ప్రమోషన్ కాస్త నిర్లక్ష్యంగా చేస్తుండటంతో ఓపెనింగ్స్ విషయంలో ప్రభావం కనిపించేలా ఉంది. గతంలో ఆది పినిశెట్టి తరహాలోనే మొదట్లో ఇబ్బందులు ఎదురుకున్న గోపీచంద్ తర్వాత యజ్ఞం తో హీరోగా సెటిల్ అయిపోయాడు. మంచి ఊపిచ్చే మాస్ సినిమాలతో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. కానీ ఆది పినిశెట్టికి అది అంత సులభం కాదు. నీవెవరో లాంటి థ్రిల్లర్ ఎంత వరకు అతనికి బూస్ట్ ఇస్తుందో వేచి చూడాలి.