చరణ్ వల్ల ఆ లోటు తీరిపోయింది

0”సాధారణంగా నేను ఓ కథ విన్న తర్వాత కొన్ని రోజులు ఆలోచిస్తా.. తర్వాత ఒప్పుకుంటా. కానీ ‘రంగస్థలం’ సినిమా కథను సుకుమార్‌ నాకు రెండు గంటలు చెప్పారు. విన్న వెంటనే చేస్తానని చెప్పేశా.. అంత బాగా కథ నచ్చింది” అని చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి.

తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను మా అమ్మా, నాన్నతో కలిసి చూశా. క్లైమాక్స్ కి ముందు నేను చనిపోతా.. అది చూసి అమ్మ ఏడ్చేసింది. పక్కనే ఉన్న నేను ఇది సినిమా అమ్మ.. నిజ జీవితం కాదని ఓదార్చా. అంతగా వారు కథలో లీనమైపోయారు. నిజ జీవితంలో నాకు అన్నయ్య ఉన్నాడు. ఈ సినిమాతో రామ్‌చరణ్‌ తమ్ముడిగా దొరికాడు. దీంతో తమ్ముడు లేని లోటు కూడా తీరిపోయింది” అని చెప్పుకొచ్చారు.