రేణు ‘పవన్ను’ గుర్తుచేసుకుంది

0విడాకులు తీసుకున్న కానీ పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ ల ప్రేమ బంధం తిగిపోలేదు. ఇద్దరు కూడా అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నారు. రేణు , పవన్ ల ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలు పూణే లో రేణు దగ్గర పెరుగుతున్నారు.

మార్చి 23న ఆద్యా పుట్టిన రోజు కావ‌డంతో గ‌త ఏడాది ఇదే రోజున పూణేకి వెళ్ళాడు ప‌వ‌న్ . ఆద్యా ఏడో బ‌ర్త్‌డే వేడుక‌ల‌లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఆద్యా తో పాటు ఈ చిన్నారి ఫ్రెండ్స్ తోను పవన్ సరదాగా గడిపాడు. ఆద్యాతో పవన్ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోస్ అప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి . అయితే పొలిటిక‌ల్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ ఈ సారి మాత్రం ఆద్యా ఎనిమిదో బ‌ర్త్‌డే వేడుక‌కి హాజ‌రు కాలేకపోయారు.

ప‌వ‌న్ అభిమానులు మాత్రం పాత ఫోటోస్‌నే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఆద్యాకి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఇక ఫోటో ను మరోసారి రేణు షేర్ చేసి కూతుర్ని ఆనంద పరిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి , పూర్తి రాజకీయాల్లోకి వచ్చాడు. తన జనసేన పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.