ఆమిర్ ఖాన్ విడాకులు ఎందుకు తీసుకున్నాడు?

0

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి బయట మాట్లాడ్డానికి అంతగా ఇష్టపడడు. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడే అతను.. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ అయ్యాడు. తన మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అతను ఈ షోలో వెల్లడించాడు.

‘‘చాలా చిన్న వయసులోనే మా ఇద్దరికీ పెళ్లి జరిగింది. బహుశా ఇది మా విడాకులకు ఒక ముఖ్య కారణం అనుకుంటున్నా. ఒక వయసు దాటాక.. పరిణతి వచ్చాక ఆలోచనలు మారిపోతుంటాయి. నాకు రీనా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. దీనికి తోడు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. అవి వచ్చాక ఇక కలిసి ఉండటంతో అర్థం లేదు. మేం విడిపోయిన సమయంలో ఇరువురి కుటుంబ సభ్యులు చాలా బాధ పడ్డారు. కానీ తప్పలేదు. రీనాకు విడాకులు ఇచ్చినంత మాత్రాన ఆమెపై నాకున్న గౌరవం తగ్గినట్లు కాదు. భార్యాభర్తలుగా మేం విడిపోయామే కానీ.. ఎప్పడూ స్నేహితుల్లా కలిసే ఉంటున్నాం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం’’ అని అమీర్ వెల్లడించాడు.

2002లో రీనా నుంచి విడాకులు పొందిన అమీర్.. మూడేళ్ల తర్వాత ‘లగాన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కిరణ్ రావును పెళ్లాడాడు. వీళ్లిద్దరికీ ఆజాద్ రావు ఖాన్ అనే కొడుకు ఉన్నాడు. రెండో భార్యతో సంతోషంగా సాగిపోతున్న అమీర్.. తన మొదటి భార్య పిల్లల్ని బాగానే ఆదరిస్తుంటాడు. వారి కెరీర్లను అతనే గైడ్ చేస్తున్నాడు. రీనాతో కూడా అతడికి మంచి సంబంధాలే ఉన్నాయి.
Please Read Disclaimer