అర్ధరాత్రి అమీర్ ఖాన్ చేసిన పని..!!

0కొందరు సినీ యాక్టర్లు సినిమాల్లో ఎన్నో జీవిత సలహాలు ఇస్తారు.. ప్రాణాలు కాపాడేందుకు సాహసాలు చేస్తారు.. కానీ నిజజీవితంలోకి వచ్చేసరికి అవేమీ పట్టించుకోరు. అప్పటివరకు కలిసి పనిచేసిన వారిని షూటింగ్ ప్రదేశం నుంచి బయటికి వెళ్లగానే వారి గురించి మరిచిపోతారు. కానీ ఇంకొందరు సినిమాల్లో మాదిరిగానే నిజ జీవితంలో రియల్ హీరోలుగా మారుతారు. అందులో బాలీవుడ్ హీరోలు ఈ రకాల్లో ముందుంటారు. వీరిలో ముఖ్యంగా అమీర్ ఖాన్ గురించి ప్రస్తుతం చెప్పాల్సి వస్తోంది. ఆయన సినిమాలు సామాజిక నేపథ్యంలోనే ఉంటాయి. అలాగే నిజజీవితంలో కూడా ఆయనది మంచి మనసు అని నిరూపితమైంది.

తాజాగా అమీర్ ఖాన్ చేసిన పనికి ఆయనను ‘ఆపద్భాంధవుడు’ – ‘రియల్ హీరో’ – ‘దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. దీంతో కొందరు అసలు విషయమేంటని ఆరా తీశారు.

అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా మంచి సినిమా అనిపించుకోవడంతో పాటు కలెక్షన్లలో రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా కోసం పని చేసిన సౌండ్ ఇంజినీర్ సాజిత్ కొయోరి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బాంద్రాలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రాథమిక వైద్యం నిర్వహించిన స్థానిక వైద్య సిబ్బంది సాజిత్ కొయోరికు బ్రెయిన్ స్ట్రోక్ అని తేల్చారు. కానీ వైద్యం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు.

దీంతో సాజిత్ కుటుంబ సభ్యులు అమీర్ ఖాన్ కు ఫోన్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన అమీర్ గురువారం అర్ధరాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచే అనిల్ అంబానికి ఫోన్ చేసి కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం సాజిత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీంతో అమీర్ ను ఆపదలో వచ్చిన దేవుడని అందరూ పొగుడుతున్నారు.