పిల్లల ఫిలిం డెబ్యూ పై ఓపెన్ అయిన అమీర్

0

అమీర్ ఖాన్ కు బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని పేరు. సినిమాల విషయంలో అమీర్ పడే తపన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తన కుటుంబసభ్యుల గురించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడతాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ కాఫీ విత్ కరణ్ చాట్ షో లో పాల్గొన్నాడు. తన పిల్లల సినిమా ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యాడు.

కొడుకు జునైద్..కూతురు ఐరా కు సినిమాల్లోకి రావాలనే ఉందని వెల్లడించాడు. జునైద్ కి యాక్టర్ కావాలని.. డైరెక్షన్ కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. కానీ తను ఎంచుకున్న మార్గం పూలబాట ఏమీ కాదని ఒక క్లిష్టమైన దారి అని ముందే హెచ్చరించాడట. అమీర్ ఖాన్ కొడుగ్గా తనకు పోలికలు ఎదురవుతాయని వాటన్నిటికి సిద్దంగా ఉండాల్సిందే అని చెప్పేశాడట. కుమారుడికి తనవైపు నుండి ఎటువంటి సపోర్ట్ ఇవ్వనని తేల్చేశాడు. కూతురి విషయంలో కూడా తన వైఖరి ఏమీ మారదని అన్నాడు. వాళ్ళే కష్టపడి తమకు కావాల్సింది సాధించుకోవాలని.. నేను వారికి సపోర్ట్ ఇవ్వడం సినిమాకు.. ప్రేక్షకులకు అన్యాయం చేయడమే అన్నాడు.

తన కూతురు సినిమాలో ఏ డిపార్ట్మెంట్ అంటే ఇష్టపడుతుందో తనకు ఇంకా తెలియదని అన్నాడు. ఇక వాళ్ళిద్దరికీ ఫీడ్ బ్యాక్ ఇచ్చే విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటానని చెప్పాడు. తన కొడుక్కి అర్హత లేదు అంటే ఆ విషయంలో తను సపోర్ట్ ఇవ్వడం జరగదని అన్నాడు. చూస్తుంటే.. మరీ కఠినాత్ముడైన తండ్రిలా ఉన్నాడే..!
Please Read Disclaimer