ఆటగాళ్లు టీజర్: రోహిత్ మర్డర్ మిస్టరీ

0రిజల్ట్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో నారా రోహిత్ ఒకరు. ఈ నారా వారబ్బాయి చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్త అంశం ఉంటుంది. విమర్శకుల ప్రశంసలు అనుకుంటున్నా కూడా కమర్షియల్ సక్సెస్ రావడం లేదు. ప్రస్తుతం ఆటగాళ్లు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

అప్పట్లో ఆంధ్రుడు వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే టీజర్ లో ఈ సారి ఓ కొత్త తరహా రోహిత్ కనిపిస్తున్నాడు. ఒక సెలబ్రెటీ పాత్రలో డిఫెరెంట్ షేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యం అని ఈజీగా అర్ధమవుతోంది. ఇక ప్రతినాయకుడు జగపతి బాబు తన సైలెంట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ని మరోసారి బయటపెట్టాడు.

హీరో భార్య మిస్టరి మధ్య సాగే ఈ కథలో రోహిత్ – జగపతి పాత్రలో హైలెట్. ఆటగాళ్లలో ఎవరు నెగ్గుతారు? ఆట ఎలా సాగుతుంది అనే మైండ్ గేమ్ కాన్సప్ట్ ఆసక్తిని రేపుతోంది. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక హీరోయిన్ గా దర్శన బానిక్ అనే కొత్తమ్మాయి నటిస్తుండగా బ్రహ్మానందం – సుబ్బరాజు వంటి నటీనటులు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.