డైరెక్టర్ Vs లాయర్.. ఓ హత్యకేసు..

0వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో నారా రోహిత్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి వరుస చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు జగపతి బాబు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఆటగాళ్లు’. గేమ్ ఫర్ లైఫ్ అనేది ట్యాగ్ లైన్. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర – వాసిరెడ్డి శివాజీ – మక్కెన రాము – వడ్లమూడి జితేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.దర్శన బానిక్ కథానాయిక. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఆటగాళ్లు సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఒక హత్య కేసు చుట్టూ అల్లుకున్న కథగా అర్థమవుతోంది. రోహిత్ సినీ దర్శకుడిగా కనిపించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కమ్ క్రిమినల్ లాయర్ గా జగపతి బాబు తన నట విశ్వరూపాన్ని చూపినట్టు అర్థమైంది. ఒక హత్య కేసులో ఇరుక్కుపోయిన దర్శకుడైన నారా రోహిత్ కు క్రిమినల్ లాయర్ జగపతి బాబుకు మధ్య సాగే ఆటే ఈ ‘ఆటగాళ్లు’ చిత్రం. నటుడు సుబ్బరాజు ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్ర పోషించాడు. ట్రైలర్ చూస్తుంటే సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుందని అనిపిస్తోంది..