రూటు మార్చిన దెయ్యం

0

రెండేళ్ల క్రితం ప్రభుదేవా-తమన్నా జంటగా వచ్చిన అభినేత్రి తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్ రాబోతోంది. అభినేత్రి 2 పేరుతో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు విజయ్. విషయానికి వస్తే కృష్ణ(ప్రభుదేవా)తన భార్య మహాలక్ష్మి(తమన్నా)తో హ్యాపీగా ఉంటాడు. జాబ్ చేస్తూ ఏ చీకుచింతా లేకుండా గడిపేస్తూ ఉండగా ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. అనుకోకుండా ఓరోజు కృష్ణ దేహంలోకి రెండు దెయ్యాలు ప్రవేశిస్తాయి.

అప్పటి నుంచి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టి తనలో అపరిచితుడిని బయటికి తీస్తాడు కృష్ణ. అంతే కాదు ఇంకో అమ్మాయి(నందిత శ్వేతా)తో ప్రేమ అంటూ కొత్త వ్యవహారం మొదలుపెడతాడు. దెయ్యం పేరు రూబీ అని తెలుస్తుంది. అసలు కృష్ణ జంటను పట్టుకున్న దెయ్యాలు ఎవరు వాళ్లకు ఆ ఇంటికి సంబంధం ఏంటి అనేది సినిమాలో చూడాలి

ట్రైలర్ రెగ్యులర్ ఫ్లేవర్ లోనే ఉంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో దెయ్యాలు హీరోయిన్లను పట్టుకుంటాయి. ఫస్ట్ పార్ట్ లో జరిగింది కూడా అదే. అందుకే వెరైటీగా దర్శకుడు ఈ సారి కాంచన తరహాలో ప్రభుదేవాకు దెయ్యం పట్టించాడు. మరీ ఎగ్జైటింగ్ గా అనిపించే అంశాలు పెద్దగా ఉన్నట్టు అనిపించడం లేదు.

సప్తగిరి-కోవై సరళ కామెడీ అంతగా అతికినట్టు లేదు. థీమ్ ని ఎక్కువగా రివీల్ చేయకుండా కేవలం ప్రభుదేవా తమన్నాలనే ఎక్కువ హై లైట్ చేసిన ఈ ట్రైలర్ లో సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోనే. సరే ట్రైలర్ ఇలా కట్ చేసి అసలు విషయాన్నీ సినిమా కోసం దాచారా మే 31 విడుదల రోజు తేలుతుంది. ప్రభుదేవా తమన్నాల మధ్య రెడీనా అంటూ సాగే హాట్ సాంగ్ మాస్ కోసం ఉద్దేశించినట్టుగా ఇందులో సాంపిల్ చూపించేశారు .
Please Read Disclaimer