నెటిజన్ కు ఆ హీరో అదిరిపోయే రిటార్ట్!

0బాగా పాపులర్ అయిన భార్యాభర్తలు……ఆ తర్వాత కొంతకాలానికి ఫేడ్ అవుట్ అయి ఇంట్లో తేరగా కూర్చొని తినే భర్త…..ఆమె డబ్బులను ఖర్చు పెడుతూ లైఫ్ లీడ్ చేస్తూ….భర్త విమర్శలు ఎదుర్కొనే వైనం….. ఈ కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో ఆషికీ-2 తరహాలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే అదే తరహాలో ప్రస్తుతం ఐష్-అభిషేక్ ల జోడీ ఉందని కొంత కాలంగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఆ కామెంట్లన్నీ అభిషేక్ కు అలవాటైపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అభిషేక్ పై నెటిజన్లు మరోసారి విమర్శలు గుప్పించారు. ఐశ్వర్యరాయ్ – కూతురు ఆరాధ్యతో కలిసి పారిస్ టూర్ లో ఉన్న అభిషేక్….పై నెటిజన్లు ట్రోల్ చేశారు. మూడేళ్లుగా సినిమాలు చేయని అభిషేక్ కు……విదేశాల్లో షికారు చేసేంత డబ్బు ఎక్కడిది అంటూ నెటిజన్లు సెటైర్లు వేశారు. అయితే దానికి అభిషేక్….ఏమాత్రం కోప్పడకుండా….నెటిజన్ కు దిమ్మదిరిగే సమాధానిమచ్చాడు.

`సర్.. నేను సినిమాల్లో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తుంటాను. ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాను. వాటిలో క్రీడలు ఒకటి….. కేవలం సినిమాల్లో నటించడం ఒక్కటే నా సంపాదన మార్గం అనుకుంటే అది మీ పొరపాటే’ అంటూ ఆ నెటిజన్ కు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానమిచ్చాడు అభి. అయితే కొంత కాలంగా అభికి ఈ తరహా విమర్శలు చాలా ఎదురవుతున్నాయి. బిగ్ బీ వారసుడిగా స్మాల్ బీ రాణించలేకపోతున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఐష్ సంపాదనతో టైంపాస్ చేస్తున్నాడంటూ….అర్థంపర్థం లేని కామెంట్స్ వస్తున్నాయి. అయితే వీటన్నింటికీ అభి….కూల్ గా సమాధానమిస్తుండడం విశేషం. 2016లో వచ్చిన ‘హౌస్ ఫుల్ 3` తర్వాత తాజాగా ‘మన్మర్జియా’ అనే చిత్రంలో అభి నటి