విషాదం : రజనీకాంత్ షూటింగ్ లో ఒకరి మృతి

0


rajani-1సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లేటెస్ట్ చిత్రం ‘కాలా’. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ లో విషాదం చోటు చేసుకుంది. షూటింగ్ కోసం ఏర్పాటుచేస్తున్న సెట్‌ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. షూటింగ్‌ నిమిత్తం చెన్నైలోని హుండమల్లి ప్రాంతంలో ఓ భారీసెట్‌ నిర్మిస్తున్నారు. ఈరోజు సెట్‌ పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్‌ షాక్‌తో ఓ సినీ కార్మికుడు మృతిచెందాడు. దీంతో యూనిట్‌ విషాదంలో మునిగిపోయింది.

ఈ ఘటన జరిగిన సమయంలో రజనీకాంత్ అక్కడ లేరు. విషయం తెలుకొని మృతిడి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు. అలాగే కుటుంబానికి అండగా వుంటాం అనే హామీ కూడా ఇచ్చారు. చిత్ర నిర్మాత రజనీ కాంత్ అల్లుడు హీరో ధనుస్ కూడా కార్మికుడి మృతిపై ప్రగాడ సానుభూతి తెలిపి, మృతిడి కుటుంబంతో మాట్లాడారు.