అనసూయ పై ఆలీ హాట్ కామెంట్స్

0Actor-ali-and--anasuyaవైవిధ్యమైన పాత్రలతో, తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సీనియర్ నటుడు ఆలీ ఇటీవల పలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. సినీ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లలో హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకొని అలీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అలీ తీరును తప్పుపటినా నోటి దురుసును ఆపుకోవడం లేదనే వాదన వినిపిస్తున్నది. తాజాగా అనసూయను ఉద్దేశించి ఆలీ చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందికరంగా మారడం గమనార్హం.

గతంలో స్టార్ హీరోయిన్లు అనుష్క, సమంత, యాంకర్లు సుమపై కూడా అలీ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. బహిరంగ వేదికలపై ఆలీ ప్రవర్తనను చూసి వారు నొచ్చుకొన్నారు. సీనియర్ నటుడు అనే ఒకే ఒక్క కారణంతో ఆలీ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకొన్నారు. పలు చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ.. ఆలీ తన తీరు మార్చుకోలేదని ధ్రువీకరించే సంఘటన తాజాగా చోటుచేసుకొన్నది. తాజాగా ఆలీ బాధితుల జాబితాలోకి యాంకర్ అనసూయ వచ్చి చేరింది.

ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌కు ఆలీ, అనసూయ హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఈవెంట్‌లో పలువురిని వేదికపైకి జంటలుగా ఆహ్వానించారు. ఆ క్రమంలో వేదికపైకి పిలిచే వంతు రాజ్ తరుణ్‌కు రాగా అనసూయ ఆయనను ఆహ్వానించింది. చాలా సరదాగా ఉండే రాజ్ తరుణ్ ‘నాకు తోడు ఎవరు లేరా’ అని కామెంట్ చేశారు. దాంతో అనసూయ స్వయంగా వేదిక తీగి రాజ్ తరుణ్‌ను తోడ్కొని వచ్చింది.

ఈ సంఘటనను చూసిన ఆలీ మరోసారి నోటికి పనిచెప్పాడు. వేదికపైకి వస్తున్న రాజ్ తరుణ్, అనసూయను ఉద్దేశించి ఆలీ కామెంట్ చేశాడు. ‘ఎవరు తోడు కావాలన్నా వెంటనే వెళ్లిపోతావా?‘ అని వ్యాఖ్యలు చేయడంతో అనసూయ షాక్ గురైంది. ఆ సమయంలో ఆ కామెంట్‌ను ఎంజాయ్ చేసినా.. ఆలీకి ఇంకా వెటకారం తగ్గలేదు అని అనుకోవడం జరిగిందట.

గతంలో రాఘవేంద్రరావు దర్శక జీవితంపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అలీ పలువురు హీరోయిన్లపై కామెంట్లు చేశారు. మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీసేందుకు వస్తే హీరోయిన్‌గా ఎవరిని ఎన్నుకుంటారు.. సమంతా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్.. ఇంకా ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఎవరిని ఎంచుకుంటారు అని యాంకర్ సుమ అని అడిగిన ప్రశ్నకు ఆలీ సమాధానం ఇస్తూ సమంత అయితే సమ్మగా ఉంటుంది అని ఆలీ కామెంట్ చేయడంతో పలువురు అవాక్కయ్యారు.

అంతే కాదు ఆ మధ్య ‘సైజ్ జీరో’ చిత్రానికి సంబంధించి ఆడియో ఫంక్షన్లో..ఆలీ అనుష్క తొడలపై కామెంట్ చేశాడు. ‘అనుష్క తొడలు’ అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టం అని ఆలీ వ్యాఖ్యలపై తీవ్ర కలకలం చోటు చేసుకుంది.

అనసూయ, ఇతర యాంకర్లు హీరోయిన్లపై ఆలీ ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆలీ ఇలాంటి కామెంట్ చాలానే విసిరాడు. సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’లా ఉందని కామెంట్ చేశాడు. తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు. తర్వాత రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్‌ను కూడా వదలకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సినీ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లలో హీరోయిన్లు, యాంకర్లను టార్గెట్ చేసుకొని అలీ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు అలీ తీరును తప్పుపటినా నోటి దురుసును ఆపుకోవడం లేదనే వాదన వినిపిస్తున్నది. తాజాగా అనసూయను ఉద్దేశించి ఆలీ చేసిన వ్యాఖ్యలు ఆమెకు ఇబ్బందికరంగా మారడం గమనార్హం.