వైసీపీలోకి మ‌రో యంగ్ హీరో…

0తెలుగు రాజ‌కీయాల‌కు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి మ‌ధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు సినీ గ్లామ‌ర్ ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. ఎన్టీఆర్ తో మొద‌లుకుని ఎంతోమంది అగ్ర క‌థానాయకులు, క‌థానాయిక‌లు సినీఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి త‌ద‌నంత‌రం త‌మ జీవితాల‌ను ప్ర‌జాసేవ‌కు అంకితం చేసేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కానీ అలా వ‌చ్చిన వారిలో కొంత‌మంది మాత్ర‌మే స‌క్సెస్ అయితే, ఎక్కువ‌మంది ఫెయిల్ అయ్యారు.

కానీ, రాజ‌కీయ పార్టీలు మాత్రం సినీ గ్లామ‌ర్ ను ఉప‌యోగించుకుని అనేక‌సార్లు విజ‌యం సాధించాయి. ఎన్టీఆర్ పై ఉన్న‌ ప్రేమ‌, అభిమానం కార‌ణంగా ఎక్కువ‌శాతం సినీ ప్ర‌ముఖులంతా మొద‌టినుంచి తెలుగుదేశం పార్టీకే మ‌ద్ద‌తుగా వ‌స్తున్నారు.

సీనియ‌ర్ హీరో, టాలీవుడ్ సూప‌ర్ స్టార్ కృష్ణ ద‌గ్గ‌ర్నుంచి థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ వ‌ర‌కు బ‌హిరంగంగా వైసీపీకి అండ‌గా నిలుస్తున్నారు. తాజాగా మ‌రో హీరో, వినాయ‌కుడు మూవీ ఫేం కృష్ణుడు సైతం వైసీపీలో చేరిపోయారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ఆక‌ర్షితుడైన ఆయ‌న తూర్పుగోదావ‌రి జిల్లా క‌త్తిపూడిలో వైఎస్ జ‌గన్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

జననేత వైఎస్‌ జగన్‌ పాదయాత‍్రతో స్ఫూర్తి పొంది తాను పార్టీలో చేరినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపీలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించడానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణుడు పేర్కొన్నారు. ఈ క్యార్యక్రమంలో పార్టీ నేతలు పెన్మత్స సురేష్‌ బాబు, సర్రాజు, సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క‌రుగా వైసీపీలోకి త‌ర‌లివ‌స్తుండ‌టంతో ఇటు టీడీపీ, అటు జ‌న‌సేన నాయ‌కుల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. మొత్తానికి ఈసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి సినీగ్లామ‌ర్ పుష్క‌లం కానుంద‌న్న విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది.