డ్రగ్స్ కేసు: మీడియాపై నారాయణమూర్తి ఫైర్

0


Narayana-Murthyడ్రగ్స్ కేసులో సినిమా వాళ్లనే తప్పుగా చూపుతూ మీడియా హైడ్రామా ఆడుతోందని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం సరికాదన్నారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. సినిమాలు తీసే మాకే సిట్, మీడియా వాళ్లు సినిమా చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

డ్రగ్స్ వాడకం 1960 నుంచి దేశంలో ఉందని, ప్రస్తుతం డ్రగ్స్ సినిమా వాళ్లే వాడుతున్నారనే భ్రమను కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతల పిల్లలు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా చాలా మంది డ్రగ్స్ వాడుతున్నారని నారయణమూర్తి ఆరోపించారు. కానీ ఇలా సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తూ మీడియాలో కథనాలు రావడం బాధాకరమన్నారు. డ్రగ్స్‌ను అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని.. డ్రగ్స్ మూలాలు వెతికి అరికట్టాలని కోరారు. ఆఖరికి స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్‌కి బానిసలు కావడం బాధాకరమన్నారు.