‘ఈనాడు’ రామోజీరావు, సినీ నటుడు రజనీకాంత్ లకు పద్మవిభూషణ్

0rajnikanthపలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘2016- పద్మ’ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పాత్రికేయరంగంలో సేవలకుగాను ‘ఈనాడు’ రామోజీరావు, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, ప్రముఖ సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి తదితరులకు పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించారు.