వరుస ఆఫర్లతో యంగ్ విలన్

0తెలుగు సినిమా పరిశ్రమకు మరో కొత్త విలన్ దొరికాడు. కృష్ణ గాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ‘శత్రు’ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించాడు. ఇటీవల వచ్చిన రంగస్థలం – భరత్ అనే నేను చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు..

ఇక తమిళంలోనూ శత్రు సత్తా చాటుతున్నాడు. కార్తి హీరోగా నటించిన ‘కడై కుట్టి సింగం’ చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ చిత్రం తెలుగులో ‘చినబాబు’గా రేపు విడుదలవుతోంది. పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కార్తీతో సమానమైన ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాడట. చినబాబు తన కెరీర్ కు ఒకేసారి రెండు భాషల్లో బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రం గనుక విజయం సాధిస్తే తెలుగు – తమిళ భాషల్లో ఈ విలన్ కు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.