సిద్ధార్థ్ మరో ప్రకాష్ రాజ్ అట!

0



పశువులను కబేలాకు తరలిస్తున్నారనే ఆరోపణలపై రక్బర్ ఖాన్ అనే వ్యక్తిపై అల్వార్ జిల్లాలో సామూహిక దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి అనంతరం గోవులతో పాటు రక్బర్ ను గోశాలకు తీసుకువెళ్లి….ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లే సరికి అతడు చనిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనలో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ చేసిన ట్వీట్ కు కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఘాటుగా రీట్వీట్ చేశారు. దీంతో రాథోడ్ ట్వీట్ పై తమిళ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. రాథోడ్ తోపాటు బీజేపీ – ఆరెస్సెస్ లపై కామెంట్స్ చేసిన సిద్ధూపై నెటిజన్లు మండిపడుతున్నారు.

`ఓ మనిషిని దారుణంగా చావబాదారా? ఈ ఘటన గోరక్షకులకు – పశువులకు సంబంధించిందా? ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందు ఆ వ్యక్తిని గోశాలకు తీసుకెళ్లారా? ఆ ప్రశ్నలకు సమాధానం అవును అయితే….ఈ వ్యవహారంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. ఇక ఆ వ్యక్తి విషయంలో న్యాయం జరగడం అనేది కల్ల. మిస్టర్ రాథోడ్ (కేంద్రమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్) మీ తీరు బాగాలేదు. నీవో పిరికివాడివి“ అని సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. దీంతో సిద్ధూ ట్వీట్లపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. బుర్రలో ఏది అనిపిస్తే అది ట్వీట్ చేయడం మానుకోవాలని – బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు కర్ణాటక – కేరళ – పశ్చిమ బెంగాల్ – పంజాబ్ లో కూడా జరిగాయని…అపుడు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ నన్ (క్రైస్తవ సన్యాసి)పై బిషప్ లైంగిక దాడి చేశాడని – యువకులతో ముస్లిం బాబా అసహజసిద్ధంగా సెక్స్ చేశాడని…అపుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రశ్నించారు. సిద్ధూ మరో ప్రకాష్ రాజ్ అంటూ ట్రోల్ చేశారు.