కొత్త గర్ల్ ఫ్రెండుతో దొరికిపోయిన అక్కినేని హీరో

0sumanth-love-with-foreign-gఅక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్…. కొన్ని రోజులుగా ఓ విదేశీ అమ్మాయితో కలిసి చట్టపట్టాలేసుకుని తిరుగుతుండటం ఫిల్మ్ నగర్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న స్టార్ బక్స్ కాఫీ షాప్ లో ఆ అమ్మాయితో కలసి సుమంత్ కనిపించాడు.

తాజాగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్ లో కూడా ఈ జంట సందడి చేయడంతో ఇద్దరి మధ్య ఏదో ‘సం’బంధం ఉందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకాలం తర్వాత సుమంత్ తనకంటూ ఓ తోడు ఎంచుకున్నాడని, ఇద్దరి మధ్య లవ్ రిలేషన్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఆ అమ్మాయితో అలాంటిదేమీ లేదని, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని…. ఏదేదో ఊహించుకోవద్దని సుమంత అంటున్నాడు.