విడిపోతున్నాం. ఇదే మా లాస్ట్‌ సెల్ఫీ: నటి భర్త

0surabhi-lakshmi-got-divorce‘ఇది మా లాస్ట్‌ సెల్ఫీ. మేం విడాకులు తీసుకున్నాం. ఇప్పటినుంచి మేం మంచి స్నేహితులం’ ఇది ప్రముఖ మలయాళ నటి సురభి లక్ష్మి భర్త విపిన్‌ సుధాకర్‌ పెట్టిన పోస్టు. భార్య సురభితో దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పెట్టి ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. పలు సినిమాలు, టీవీ షోలతో పాపులర్‌ అయిన సురభి లక్ష్మి భర్త విపిన్‌ నుంచి తాజాగా విడాకులు తీసుకుంది.

వీరిద్దరూ సామరస్యంగానే విడిపోయారు. వీరికి కలికట్‌ ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సురభి, విపిన్‌ గత కొన్నాళ్లుగా వేరుగా ఉంటున్నారు. భర్త విపిన్‌ పోస్టును షేర్‌చేసిన సురభి తాము గత ఏడాదికాలంగా వేరుగా ఉంటున్నామని, ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకున్నామని తెలిపింది. విడిపోయినా ఒకరినొకరు గౌరవించుకుంటామని పేర్కొంది.