సినీ నటి నమిత పెళ్లి ఈ నెల 24న

0namithaసినీ నటి నమిత పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లకు చెక్‌పెట్టారు. ‘మియా’ చిత్రంలో తనతో నటించిన వీరాను ఈ నెల 24న వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ పెళ్లిపై వీరిద్దరూ స్పష్టతను ఇస్తూ అభిమానుల ఆశీర్వాదాలను కోరుతూ.. ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

అయితే కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం సీనియర్‌ నటుడు శరత్‌ బాబును నమిత వివాహమాడనుందనే వార్త కూడా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.