రజినీకి గాట్టి ముద్దెట్టేసిందిగా!

0TV-Actress-Chaitra-Reddy-Kisses-Rajniతమ అభిమాన స్టార్ కళ్ల ఎదురుగా కనిపిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? ఓ స్థాయి వరకూ అయితే ఫోటో దిగాలని.. వారి భుజం తమ చేతుల మీద వేయించుకుని.. ఆ క్షణాన్ని చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకుంటారు. విపరీతమైన అభిమానం.. వాళ్లను కలిసే క్షణం అనుకోకుండా దొరికేస్తే.. చటుక్కున బుగ్గపై ఓ స్ట్రాంగ్ ముద్దు పెట్టుకోవడమో.. పెట్టించుకోవడాన్ని పెద్దగా అబ్జెక్షన్ చేయలేం.

ప్రస్తుతం రజినీకాంత్ కు ఓ అమ్మాయి స్ట్రాంగ్ గా ముద్దిచ్చేయడం సెన్సేషన్ అవుతోంది. తనకంటే దాదాపు 3 రెట్ల వయసు ఉన్న ఈ సూపర్ స్టార్ కు.. ఓ సీరియల్ యాక్ట్రెస్.. బుగ్గమీద గాట్టి ముద్దు ఇచ్చేసింది. ప్రస్తుతం కాలా కరికులన్ సినిమా షూటింగ్ లో రజినీకాంత్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ సందర్భంగా.. జీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ అయిన చైత్రా రెడ్డి.. అక్కడకు వచ్చింది. రజినీకాంత్ తో ఫోటో దిగాలన్న తన కోరికను వెలిబుచ్చింది. అంతే కాదు.. ఆయనకు బుగ్గపై ఓ ముద్దిస్తూ ఫోటో దిగాలన్న తన కోరికను కూడా చెప్పింది. దీనికి నవ్వుతూనే సరే అన్నారు రజినీ.

అయితే.. ఆయన కూడా ఊహించని స్థాయిలో.. గట్టిగా బుగ్గను ముద్దాడేసింది చైత్రా రెడ్డి. సూపర్ స్టార్ తన సహజ శైలిలో నవ్వుతూనే ఉన్నా.. ఆ ముద్దు పెట్టేటపుడు అమ్మడి తన్మయత్వం చూస్తే.. ఎంతటి అభిమానమో అనిపించక మానదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో టాప్ ట్రెండింగ్ లో నిలిచిందంటే.. అందుకు చైత్రా రెడ్డి ఫేస్ లో కనిపిస్తున్న ఫీలింగ్సే అసలు కారణం.