నటి రిచా అనుమానాస్పద మృతి

0Actress-Richa-Suicideహిమాచల్ మూవీస్‌కు చెందిన 24 ఏళ్ల వయస్సు నటి రిచా ధిమాన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో ఆమె శుక్రవారంనాడు శవమై తేలింది. ఆమె మృతి వెనక ఓ కానిస్టేబుల్ ఉన్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె మరణం వివాదంగా మారింది.

రిచా తలుపులు తీయడం లేదనే సమాచారం అందడంతో పోలీసులకు ఆమె మరణం విషయం శుక్రవారం ఉదయం 11 గంటలకు తెలిసింది. పోలీసులు వచ్చి చూసే సరికి గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. వారు తలుపులు బద్దలు కొట్టి గదిలోకి ప్రవేశించారు. ఆమె శవం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిచంింది.

సంఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని, అందులో ఓ కానిస్టేబుల్ పేరు రాసి ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. వారిద్దరి మధ్య గల సంబంధమే ఈ మరణానికి దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

ఆ నటికి సోషల్ మీడియాలో ఆ రాష్ట్రానికి సంబంధించిన 40 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రస్తుత దర్యాప్తుతో తమకు నమ్మకం లేదని, సీరియస్‌గా దర్యాప్తు చేయించాలని నటి తల్లిదండ్రులు మంత్రి జిఎస్ బాలీని కలిసి విజ్ఋప్తి చేశారు. పోలీసు కానిస్టేబుల్‌తో సంబంధం కారణంగానే తన కూతురు మరణించిందని రిచా తల్లి ఆరోపిస్తోంది.