అబ్బా అబ్బబ్బా.. ఏంటిది కియారా?

0ఈ ముంబై బ్యూటీలకు ఏమాత్రం జాలి దయ కరుణ అనే పదాలకు అర్థాలే తెలియవు. అవును. వాళ్ళు హిందీ వాళ్లు కదా.. మన తెలుగు పదాలకు వాళ్ళకెలా మీనింగులు తెలుస్తాయి? గూగుల్ ట్రాన్స్ లేట్ లో ఆ పదాలు టైప్ చేస్తే తప్ప వాళ్ళకు తెలియదు. దాంతో వచ్చింది అసలు చిక్కు. వాళ్ళేమో హాట్ వీడియోలు పెడతారు. కానీ నెటిజనుల హీట్ పెరిగేందుకు ‘భాష’ తో పని లేదు కదా?

ఈమధ్యే ‘భరత్ అనే నేను’ అనే డీసెంట్ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ను బుట్టలో వేసుకొని తన చుట్టూ తిప్పుకున్న కియారా అద్వానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. తన ఒంపుసొంపులకు అసలు రహస్యమైన కసరత్తులను ఎలా చేయాలో.. తను ఎలా చేస్తుందో మనకు వివరిస్తూ ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. లేసుల స్పోర్ట్స్ టాప్.. అందమైన కాళ్ళను గట్టిగా వదల్లేమన్నట్టుగా అంటుకున్న లెగ్గింగ్స్ తో పుల్ అప్స్ చేస్తూ నెటిజనుల ప్రాణాలు తోడేస్తోంది. నిజమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి వాడినే తన చుట్టూ బొంగరంలా తిప్పుకున్న భామకు సభ్య సమాజ సభ్యులైన నెటిజనులు ఓ లెక్కా..?

ఈ టాలెంట్ చూసే ఏమో బోయపాటి మెగా కుటుంబ వారసుడు అయిన చరణ్ బాబుకు ఈ అందాన్ని కొత్త సినిమా జతగా ఎంచుకున్నాడు. మహేష్ బాబును ఆల్రెడీ చుట్టూ తిప్పుకుంది ఇప్పుడు చిట్టిబాబు ఈ అందాన్ని ఎలా తట్టుకుంటాడో చూడాలి. అంతలోపు ఆమె కసరత్తులను చూసి తరించండి.